: అఖిలేశ్ కు నిరసనల సెగ
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ కు నిరసన సెగ తప్పలేదు. ముజఫర్ నగర్ జిల్లాలో అల్లర్ల బాధితులను పరామర్శించేందుకు ఆయన నేడు జిల్లాకు విచ్చేశారు. అల్లర్ల కారణంగా ఒక్క కవల్ గ్రామంలోనే 45 మంది మరణించారు. దీంతో, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు పటిష్ట భద్రత నడుమ అక్కడికి వచ్చిన అఖిలేశ్ కు స్థానికులు తీవ్ర నిరసనలతో స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ఓ యువకుడి తండ్రిని అఖిలేశ్ కలిశారు. కవల్ పక్క గ్రామమైన మల్లిక్ పురాకు చెందిన యువకులు మహిళలను వేధిస్తుండడంతో అడ్డుపడిన ఆ యువకుడిని వారు హతమార్చిన సంగతి తెలిసిందే.