: మూతపడిన 75వేల వస్త్ర దుకాణాలు
వస్త్రాలపై విధించిన వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేస్తూ వస్త్ర వ్యాపారులు చేస్తున్న ఆందోళనలతో రాష్ట్ర వ్యాప్తంగా 75వేల వస్త్ర దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు మూతబడడంతో ప్రధాన నగరాలు సందడిని కోల్పోయాయి. మరోవైపు సెన్సిటివ్ కమాడిటీస్ చట్టాన్ని అమలు చేయడం తగదని వస్త్ర వ్యాపారుల సంఘం నిరసన వ్యక్తం చేస్తోంది.