: 'యుద్ధభేరి' సభకు రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తాం: మంద కృష్ణ
తెలంగాణకు మద్దతుగా ఈనెల 21న విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్శిటీలో 'యుద్ధభేరి' సభ నిర్వహిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు. ఈ సభలో పాల్గొనాలని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తామని తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ సభకు పోలీసుల అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. హైదరాబాదును యూటీ చెయ్యాలని భావిస్తే పోరాటం తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు.