: తీవ్రరూపు దాల్చుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం


సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ సమైక్యవాదులు ఊరూవాడా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. నేడు నెల్లూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా లక్ష మందితో యాదవ గర్జన నిర్వహించారు. దీంతో నెల్లూరు పట్టణంలో పెద్దఎత్తున కోలాహలం నెలకొంది. అనంతరం భారీ మానవహారం నిర్వహించారు. ఇక కడప జిల్లా మైదుకూరులో స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా-వార్పూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాన్-పొలిటికల్ జేఏసీ చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమానికి స్వర్ణకారులు సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. ఉద్యోగుల ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు.

  • Loading...

More Telugu News