: దేశ ఆర్ధిక వ్యవస్థపై రాష్ట్రపతి ధీమా
దేశ ఆర్ధిక వ్యవస్థపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ధీమా వ్యక్తం చేశారు. కోల్ కతాలో జరిగిన బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న రాష్ట్రపతి ప్రసంగిస్తూ, త్వరలోనే ఎకానమీ గాడినపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోమన్నారు. మన ఆర్ధిక పునాదులు ఇప్పటికీ బలంగానే ఉన్నాయని ప్రణబ్ ఉద్ఘాటించారు. రూపాయికి మరింత బలం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశం ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్ధిక సంస్కరణల కొనసాగింపులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.