: గిరిజనుల దాడి.. ఫారెస్ట్ ఆఫీసర్ మృతి
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కేకే తండా నల్లవెల్లి అటవీప్రాంతంలో గిరిజనులు అటవీ శాఖ రేంజ్ అధికారిపై దాడి చేసి చంపేశారు. అటవీ భూములను సాగుచేసుకునేందుకు స్థానిక గిరిజనులు కొంతకాలంగా యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వారు గతరాత్రి ఆ భూముల్లో వ్యవసాయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సమాచారంతో డిచ్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగయ్య తన సిబ్బందితో అక్కడికి వెళ్ళారు. ఆయన గిరిజనులను అడ్డుకోవడానికి యత్నించడంతో వారు ఆయనపై కారం, కర్రలు, గొడ్డళ్ళతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో, గంగయ్య తీవ్రగాయాలతో సంఘటన స్థలంలోనే మరణించారు. ఏడుగురు సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.