: అగ్ని-5 విజయవంతం


భారత్ అమ్ములపొదిలో పాశుపతాస్త్రం అగ్ని-5 మరోసారి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అణు వార్ హెడ్ లను సైతం మోసుకుపోగల ఈ దూరశ్రేణి క్షిపణిని ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి రక్షణ శాఖ నేడు పరీక్షించింది. 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా తుత్తునియలు చేయడం ఈ మిస్సైల్ విశిష్టత. కాగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అగ్ని-5 మరిన్ని పరీక్షలను తట్టుకుని నిలబడగలిగితే ఖండాంతర క్షిపణి సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనాల సరసన భారత్ కూడా చేరుతుంది.

  • Loading...

More Telugu News