: దురదగొండి ఉంగరం


అనగనగా ఒక ఉంగరం. దాన్ని ధరించిన మహిళలకు అది రక్షా కవచంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక ప్రత్యేకమైన ఉంగరాన్ని నిపుణులు రూపొందించారు. ఈ ఉంగరంలో ప్రత్యేక రసాయనాన్ని నింపి దాన్ని తయారుచేశారు. ఈ ఉంగరంతో మహిళలకు కాస్త రక్షణ ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు.

శనివారం నాడు బెంగుళూరులో ఒక ప్రత్యేకమైన ఉంగరాన్ని ఆవిష్కరించారు. ఈ ఉంగరంపేరు ఉమెన్‌ స్టింగ్‌. ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలను వేధించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే మహిళలకు ఆకతాయిల నుండి రక్షణ కోసం ఈ ఉంగరం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో కారంపొడి, ఇతర రసాయనాలతో రూపొందించిన క్యాప్సైసిన్‌ అనే ద్రవం ఉంటుంది. ఇది తగిలితే కండరాల్లో భరించలేని మంట, నొప్పి పుడుతుంది. ఎవరైనా ఆకతాయిలు దాడిచేస్తే ఉంగరానికి ఉండే చిన్న సూదిద్వారా ద్రవం బయటికి వచ్చి ఆకతాయిలకు మంట పుట్టిస్తుంది. ఈ మంటనుండి అవతలివారు తేరుకునేలోగా అమ్మాయిలు అక్కడినుండి తప్పించుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News