: ఇస్త్రీ చేసి నిరసన తెలిపిన టీడీపీ నేత
టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తిరుపతిలోని పూలే విగ్రహం వద్ద రజకులు చేపట్టిన సమైక్యాంధ్ర దీక్షా శిబిరం వద్ద ఆయన దుస్తులు ఇస్త్రీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, సమస్యను పరిష్కరించాలని బాబు లేఖ ఇస్తే దానిపై కాంగ్రెస్, వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బాబు లేఖ ఇస్తే విభజనను ఆపేస్తారా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ది కోసం పాకులాడడం సరికాదని ఆ పార్టీలకు హితవు పలికారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా బీసీలంతా ఒక్కతాటిపైకి రావడం అభినందనీయం అన్నారు.