: క్వార్టర్స్ లో మాట్లాడడంకాదు, ప్రజల ముందుకు రండి: మంత్రులకు అశోక్ సూచన


సీమాంధ్ర మంత్రుల వైఖరిపై ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈనెల 7న హైదరాబాదు సభలో పాల్గొని, తిరుగుప్రయాణంలో తెలంగాణ వాదుల దాడిలో గాయపడి ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను అశోక్ నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్ర మంత్రులు క్వార్టర్స్ లో కూర్చుని మాట్లాడడం కాదని, ప్రజల్లోకి రావాలని సూచించారు. తాము మంత్రుల రాజీనామా కోరలేదని అనడం సరికాదన్నారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేస్తే అధిష్ఠానంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. కాగా, ఈ ఉదయం కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు తమ రాజీనామాలు కోరలేదని చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News