: భత్కల్ ను బీహార్ కు తీసుకెళ్లిన ఎన్ఐఏ
ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను ఈ రోజు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఢిల్లీ నుంచి బీహార్ తీసుకెళ్లింది. అటు, అతని సహచరుడు అసదుల్లా అక్తర్ ను కూడా దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ రోజే హైదరాబాద్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు విచారణ సమయంలో బీహార్ లోని దర్భంగా, సమస్థీపూర్, మధుబనీ జిల్లాలతో ఉన్న సంబంధాన్ని భత్కల్ వివరించడంతో ఎన్ఐఏ అక్కడికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్పిన వివరాలతో బీహార్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన సంస్థ వెంటనే దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.