: హైదరాబాద్ యూటీ చేసే ప్రయత్నం జరుగుతోంది: మందకృష్ణ


హైదరాబాద్ మాదంటే మాదంటూ సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తున్న తరుణంలో నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ఢిల్లీలో ప్రయత్నం జరుగుతోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనుమానం వ్యక్తం చేశారు. దానిని అడ్డుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర బీజేపీ కృషి చేయాలని కోరారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మందకృష్ణ కలిశారు. హైదరాబాద్ అంశంపై చర్చించారు. సీమాంధ్ర పెట్టుబడి వర్గానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయని అనంతరం మీడియా ఎదుట తెలిపారు. అయితే, దిగ్విజయ్ ప్రకటించిన పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News