: రామ్ చరణ్ ఫ్లాట్ ను స్వాధీనం చేసుకున్న ఈడీ!
ఎమ్మార్ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం శుక్రవారం నాడు హైదరాబాదులోని పలు విల్లాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మణికొండ ప్రాంతంలోని బౌల్డర్ హిల్స్ లో 19 ఫ్లాట్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈ విల్లాల్లో హీరో రామ్ చరణ్ కు చెందిన ఫ్లాట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఫ్లాట్ రామ్ చరణ్ పేరిట రిజిస్టర్ కాకపోయినా, సీబీఐ తన చార్జ్ షీట్లో రామ్ చరణ్ కొన్నట్టు వెల్లడించింది. అందుకు సంబంధించి ఈ యువ హీరో స్టేట్ మెంట్ కూడా ఉన్నట్టు అభియోగపత్రంలో పేర్కొంది.