: భాజపాలో మోడీ భజన ఎక్కువైంది: తులసిరెడ్డి
బీజేపీలో నరేంద్ర మోడీ భజన ఎక్కువైందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మోడీ బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాడని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారని... కానీ, మోడీకి అంత సీన్ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఆకులు రాలిన కమలంలా ఉందని తెలిపారు. 2014 లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపారు. కొన్ని పార్టీలు రాజకీయంగా ఎదగడానికే రాష్ట్ర విభజన వైపు మొగ్గుచూపుతున్నాయని విమర్శించారు.