: ఒకే పరీక్ష నాలుగు కాలాలపాటు నడిపిస్తుంది
ముందస్తు వైద్య పరీక్షలే మన ఆరోగ్యాన్ని కాపాడగలవు. అదేంటో గానీ, మనకో మోటారు వాహనం ఉందనుకోండి. క్రమం తప్పకుండా మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లి సర్వీస్ చేయించుకుంటాం. మరి మన దేహానికి ఏదీ సర్వీస్? రోగం వచ్చిన తర్వాతే వైద్యులు అవసరమన్న అపోహ ఉంటే వెంటనే విడిచి పెట్టాలి. అలాగే పరీక్షలు కూడా. రోజుకో వైద్య పరీక్షలో భాగంగా నేడొకటి మీ కోసం.
ఆరోగ్య పరీక్ష - 5
చిన్నారులు చక్కగా ఎదగాలన్నా, యువకులు పరుగులెట్టాలన్నా.. వృద్ధులు పట్టుగా నడవాలన్నా ఎముకలు బలంగా ఉండాలి. కాల్షియం, ఇతర పోషకాలు తగ్గితే ఎముకలు బలహీనపడతాయి. దేహంలో హార్మోన్లు అసమతుల్యంగా మారినా ఎముకలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆడవారిలో ఈ పరిస్థితి కనిపిస్తుంది.
ఎముకలు బలంగా ఉంటేనే నాలుగు కాలాల పాటు నడవగలం, తిరగగలం. నేడు సరైన ఆహారం తీసుకోకపోవడం, తీసుకునే ఆహారంలో కాల్షియం లోపించడం, లేదా శరీరానికి కావాల్సిన పరిమాణంలో కాల్షియం అందకపోవడం, పలు కొత్త కొత్త వ్యాధులు (ఉదాహరణకు చికున్ గున్యా)ల కారణంగా చిన్న వయసులో ఎముకలలో పటిష్ఠత తగ్గుతోంది.

అందుకే 25 ఏళ్లు దాటిన వారందరూ ఏడాదికోసారి బోన్ మినరల్ టెస్ట్ చేయించుకోవడం అవసరం. ఇది తేలికపాటి రక్తపరీక్ష. స్కానింగ్ విధానంలోనూ పరీక్షిస్తారు. 40ఏళ్ల వయసు దాటిన వారైతే ఆరు నెలలకోసారి చేయించుకోవాలి. దానివల్ల మీ ఎముకల పటిష్ఠత ఎంతుందో తెలుసుకోవచ్చు. తద్వారా ఆస్టియో పోరోసిస్ (ఎముకలు గుల్ల బారి పోవడం), ఆర్థరైటిస్ లాంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంటే గుర్తించవచ్చు.
ఎముకలు గుల్లబారితే పట్టుతప్పి కింద పడిపోవడం, ఫ్రాక్చర్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళలకు ఆస్టియో పొరోసిస్ ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే రుతుక్రమం నిలిచిపోవడంతో హార్మోన్ల పనితీరులో మార్పు వస్తుంది. ఫలితంగా వారికి కాల్షియం లోపిస్తుంది. అందుకే ముందస్తు పరీక్షలతో ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సదా శ్రేయస్కరం.