: సీఎమ్, బొత్స ఢిల్లీ పయనం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు మేర ఆయన రాజధాని చేరుకున్నారు. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్ లతో బాటు పలువురు కాంగ్రెస్ నేతలను ఆయన కలుసుకుంటారు. తెలంగాణ అంశంతో బాటు రాష్ట్రంలోని పలు ఇతర పరిస్థితులపై చర్చించడానికి ముఖ్యమంత్రిని అధిష్ఠానం ఢిల్లీకి పిలిచింది.

ఇదిలా ఉంచితే, తెలంగాణ అంశంపై జరిగే భేటీలో పాల్గొనడానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఈ ఉదయమే ఢిల్లీ వెళ్ళారు. ఇంకా పార్టీ సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ, పనబాక లక్ష్మి, పురందేశ్వరి, మధు యాస్కీ తదితరులు కూడా ఒకే విమానంలో ఈ ఉదయం దేశ రాజధానికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News