: పెరిగిన పెట్రోల్ ధరలపై సీపీఎం ఆందోళన
పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నేతలు, కార్యకర్తలు హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీఏ దిష్టిబొమ్మకు ఉరివేసి దహనం చేశారు. ఈ ఏడాదిలో ఒక్క ఆరు నెలల్లోనే ఎనిమిదిసార్లు పెట్రోలు ధరను పెంచిన ఘనత యూపీఏకు దక్కిందని రాఘవులు విమర్శించారు.