: మోడీ నిర్ణయంపై ఎవరూ బాధపడలేదు: సుష్మా స్వరాజ్
బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని ప్రకటించడం ఆ పార్టీలోని పలువురు నేతలకు మింగుడుపడని విషయమే. ఈ విషయం తెలిసిందే అయినా బహిరంగంగా వ్యతిరేకించింది మాత్రం అగ్రనేత ఎల్ కే అద్వానీ ఒక్కరే. దాంతో, నిన్నటి పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరయ్యారు. అయినా, మోడీకి అద్వానీ ఆశీస్సులు ఉంటాయని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఈ రోజు అద్వానీని కలిసిన అనంతరం అదే విషయం చెప్పారు. మోడీ నిర్ణయంపై ఎవరూ కలతచెందలేదన్నారు.