: కొలీజియం విధానానికే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సమర్థన
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపికకు ప్రస్తుతమున్న కొలీజియం విధానానికే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం మద్దతుగా నిలిచారు. అయితే ఈ విధానాన్ని బిల్లు తీసుకురావడం ద్వారా మార్చడమన్నది కేంద్ర ప్రభుత్వ విశేషాధికారంగా పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా తాను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న బిల్లు అంశాలలోకి వెళ్లబోనని, ఇది కేంద్ర ప్రభుత్వ విశేషాధికారంలోనిదని జస్టిస్ సదాశివం చెప్పారు. ఈ విధానాన్ని ఆమోదించడం, ఆమోదించకపోవడం ప్రజల అభిమతంగా పేర్కొన్నారు. జ్యుడీషియల్ అపాయిమెంట్ కమిషన్ గురించి ఏదైనా ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.