: బుల్లితెరతో కొత్త కెరీర్ ఆరంభం: అనిల్ కపూర్
త్వరలో ప్రారంభం కానున్న టీవీ షో '24' ద్వారా తన కొత్త కెరీర్ ఆరంభం అవుతోందని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ అన్నారు. చిత్ర పరిశ్రమలో 30 ఏళ్లపాటు ఉన్న తనకు బుల్లి తెర కొత్త కెరీర్ గా పేర్కొన్నారు. ఎంతో ఉత్తేజంగా ఉందని స్పందన వ్యక్తం చేశారు. అమెరికా టీవీ షో '24' రైట్స్ ను అనిల్ కపూర్ చిత్ర నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. ఫిక్షన్ ఆధారిత ఈ షోలో అనిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టీవీ చానళ్ల ప్రారంభ కాలంలో బునియాద్, రామాయణం లాంటి మంచి సీరియల్స్ వచ్చాయని, ప్రస్తుతం మంచి సీరియళ్లన్నవి కనిపించడంలేదన్నారు. దీంతో యువత టీవీ సీరియళ్లకు దూరంగా వెళ్లారని, ఈ పరిస్థితిని తన నటనతో రానున్న '24' షో మార్చివేస్తుందని అనిల్ అభిప్రాయపడ్డారు.