: చిరంజీవికి ఇంటికి 'విశాలాంధ్ర' సెగ


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నివాసాన్ని విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ముట్టడించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటిని చుట్టుముట్టిన నేతలు, కార్యకర్తలు ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పదవికి రాజీనామా చేయాలంటూ వారు ఇంటి ఎదుట బైఠాయించారు. కొద్దిసేపటి తర్వాత నివాసంలోకి వెళ్ళేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త ఏర్పడింది. అయితే, ఆందోళనకారులను పోలీసులు అక్కడినుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  • Loading...

More Telugu News