: ఫిల్మ్ ఇండస్ట్రీని సర్వీస్ ట్యాక్స్ అధికారులు టార్గెట్ చేశారు: వర్మ
నాలుగు రోజుల కిందట సేవా పన్ను శాఖ అధికారులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చెందిన ముంబయి కార్యాలయాల్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. దీనిపై మాట్లాడిన వర్మ.. సర్వీస్ ట్యాక్స్ అధికారులు ఓ అవసరం కోసం చిత్ర పరిశ్రమను లక్ష్యం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ పన్ను విధాన పథకంలో చాలా సందిగ్ధత ఉందన్నారు. మిగతా దర్శకుల్లాగే తమకు కూడా సేవా పన్ను గురించి తెలియదన్న వర్మ దీనిపై చాలా సందేహాలు ఉన్నాయన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం నుంచి లబ్ది ఎలా పొందవచ్చో ఆలోచిస్తున్నంతలోనే తమ కార్యాలయాల్లో సోదాలు చేసి, రహస్య వివరాలను బహిర్గతం చేయడం చాలా దురదృష్టమన్నారు.