: మహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమోన్మాది కిరాతకం


మహబూబ్ నగర్ జిల్లాలో ఓ యువకుడు ఉన్మాదం తలకెక్కి ప్రియురాలని కర్కశంగా నరికేశాడు. పెళ్ళికి అంగీకరించకపోవడమే అందుకు కారణం. వివరాల్లోకెళితే.. తాడూరు మండలం ఆకునెల్లి కుదురుకు చెందిన అనిత (17) ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన తిరుపతయ్య అనే యువకుడితో ఆమె పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళి చేసుకుంటామని వారిద్దరూ ఓ రోజు తమ కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, అనిత మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో, తిరుపతయ్య తీవ్ర నిరాశకు లోనయ్యాడు.

అనిత నిన్న పొలంలో కూలీ పని కోసం వెళ్ళగా, తిరుపతయ్య అక్కడికి చేరుకుని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. అనిత నిరాకరించడంతో తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. రక్తపు మడుగులో ఉన్న ప్రియురాలిని చూసి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనికోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News