: మణిపూర్ బాంబు పేలుడులో పదిమంది మృతి
మణిపూర్లో బాంబు పేలుడు ఘటనలో పదిమంది మృతి చెందారు. పదిమందికిపైగా గాయపడ్డారు. మిలిటెంట్లు తూర్పు ఇంఫాల్ జిల్లా ఖురాయ్ వద్ద నిన్న రాత్రి అస్సాం రైఫిల్స్ దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడుకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు తమదే బాధ్యత అని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్నట్టు స్థానిక టీవీ చానల్ పేర్కొంది.