: సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి: గంటా


రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాలంటూ డిమాండ్ లు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వారిలో కొందరు చేద్దామని, మరికొందరు చేస్తే ఉపయోగమేంటన్న వాదనలు వినిపిస్తున్నారు. దాంతో, వారిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. రాజీనామాలపై వారిలో పలు అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. నేటి వారి సమావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించాలని సూచించారు. కాగా, ఢిల్లీలో 48 గంటల దీక్షపై పరిశీలిస్తున్నామన్న గంటా, సమైక్య ఉద్యమాన్ని స్పాన్సర్డ్ ఉద్యమం అనడం అవివేకమని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News