: రాజీనామా చేస్తే ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకున్నట్టే: లగడపాటి


మరికాసేపట్లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సమావేశం కానున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేయమంటూ సీమాంధ్ర ఉద్యమకారులు ఒత్తిడి తెస్తున్నారన్న ఆయన, అలా చేయడమంటే ప్రత్యేక రాష్ట్రానికి ఒప్పుకున్నట్లేనన్నారు. అయితే, స్పీకర్ ఫార్మాట్ లో ఇప్పటికే రాజీనామా చేశామని.. సరైన సమయంలో వాటిని ఆమోదింపజేసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు రాజీనామా చేయడంవల్ల కూడా ఉపయోగం ఉండదని చెప్పారు. సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేదిలేదని తెలిపారు. కాగా, రాష్ట్రానికి ఆంటోనీ కమిటీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నామని చెప్పారు. సమావేశానికి ఇద్దరు కేంద్రమంత్రులు, ఇద్దరు ఎంపీలు తప్ప అందరూ వస్తారన్నారు.

  • Loading...

More Telugu News