: 'మోడీకి వీసా' విధానంలో ఎలాంటి మార్పులేదు: యూఎస్


2014 సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటికీ ఆయన వీసా విధానంలో ఎలాంటిమార్పు లేదని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. అయితే, వీసా కోసం మోడీ దరఖాస్తు చేసుకోవచ్చని, మిగతావారిలాగే ఆయన ఎదురుచూడాల్సి ఉంటుందని యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. తమ దేశ చట్టం ప్రకారం తప్పకుండా వీసాపై సమీక్ష ఉంటుందని ఆమె చెప్పారు. అయితే, ఏ దేశ విదేశీ రాజకీయాల్లో కానీ, ఆ దేశ అంతర్గత విషయాల్లో గానీ అమెరికా కలుగజేసుకోదన్నారామె. ఈ విషయంపై ఇంతకంటే ఎక్కువగా తాను మాట్లాడదల్చుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News