: గుండెకు మేలుచేసే బొప్పాయి
బొప్పాయి పండు విటమిన్లతో కూడి ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా కొందరికి ఈ పండంటే పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటి వారికి ఈ విషయం తెలియాల్సిందే. బొప్పాయి పండును తినడం వల్ల ఇతర పండ్లను తినడంకన్నా కూడా అధికంగా లాభాలు పొందవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇతర పండ్లతో పోల్చుకుంటే బొప్పాయిలో అధిక పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయిలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు చక్కగా ఉపకరించి జీర్ణక్రియ మెరుగుపడేలా చేస్తుంది. అలాగే దీనిలో ఉండే కొన్నిరకాలైన ఎంజైములు హానికరమైన కొవ్వును తగ్గించి గుండెకు ఎలాంటి సమస్యలు రాకుండా చేస్తాయి. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. మన మేనిఛాయ తగ్గినా, ముడతలు కనిపించినా వాటిని నివారించడంలో బొప్పాయి చక్కగా ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరగడం వల్ల మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఇక ఇందులో కెలోరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. ఇలాంటి పండును ఎంత తిన్నా కూడా శరీరానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కాబట్టి వీలైనంత ఎక్కువగా బొప్పాయి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.