: క్యాన్సర్ కణాలకు కొత్త తరహా చికిత్స
క్యాన్సర్ కణితులకు కొత్త తరహా చికిత్సను శాస్త్రవేత్తలు రూపొందించారు. మనుషుల్లో వచ్చే క్యాన్సర్ రకాల్లో మెదడుకు వచ్చే క్యాన్సర్‌లో ఒక రకం గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే ట్యూమర్స్ అత్యంత ఎక్కువగా, తీవ్ర స్థాయిలో కనిపించే క్యాన్సర్‌గా చెప్పవచ్చు. ఈ క్యాన్సర్ కణితులకు కొత్త తరహా చికిత్సను ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మెడికల్ రీసెర్చ్‌కి చెందిన పరిశోధకులు క్యాన్సర్ కణితులకు కొత్త రకమైన చికిత్సను రూపొందించారు. గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మేట్యూమర్స్ కేసుల్లో సగందాకా తాము గుర్తించిన ఈపీమెచ్‌ఏ3 అనే ప్రొటీన్ కారణంగా ఉందని తాము గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా తాము గుర్తించిన రిసెప్టర్ వయోజనుల్లో తీవ్రస్థాయి మెదడు క్యాన్సర్లపై 50 శాతం దాకా ప్రభావం చూపినట్టు పరిశోధకులు చెబుతున్నారు. మరో మూడేళ్లలో మనుషులపై ఈ చికిత్సకు సంబంధించిన ప్రయోగాలు చేపట్టనున్నట్టు పరిశోధకులు తెలిపారు.