: అగ్ని ప్రమాదానికి 18 మంది బలి
కోల్ కతా అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తెల్లవారు జామున చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకూ 18 మంది ఊపిరి ఆగిపోయింది. ఎంతో మంది గాయపడ్డారని సమాచారం. ఇంకా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలమైన సూర్యాసేన్ మార్కెట్ వద్దకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేరుకుని పరిశీలించారు. గాయపడిని వారిని పరామర్శించారు.
గోదాములు, షాపులలో నివసించడం మానుకోవాలని మమత వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వమే వారికి కావాలంటే నివాస వసతి కల్పిస్తుందని చెప్పారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి 50వేల నగదు సాయం అందిస్తామని తెలిపారు.

- Loading...
More Telugu News
- Loading...