: అద్వానీ నివాసానికి మోడీ
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన నరేంద్ర మోడీ తాజాగా ఆశీస్సులు అందుకోవడానికి అగ్రనేత అద్వానీ ఇంటికి వెళ్ళారు. మోడీ అభ్యర్థిత్వాన్ని అద్వానీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పార్టీ అధినాయకత్వం అద్వానీని ఆహ్వానించింది. అయితే, ఆయన గైర్హాజరయ్యారు. తన ఆవేదనను లేఖ రూపంలో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ కు తెలియపర్చారు. ఈ నేపథ్యంలో స్వయంగా మోడీనే అద్వానీ నివాసానికి వచ్చారు.