: గుర్గావ్ లో బ్రిటిష్ బాలికపై లైంగిక వేధింపులు


భారత్ లో మహిళలపై అఘాయిత్యాలకు ఇప్పట్లో అడ్డుకట్టపడే సూచనలు కనిపించడంలేదు. తాజాగా గుర్గావ్ లో ఓ తొమ్మిదేళ్ళ బ్రిటిష్ బాలికపై డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గుర్గావ్ నుంచి ఆ బాలికను ఢిల్లీలోని పాఠశాలకు తీసుకెళ్ళే క్రమంలో ఉమేశ్ (29) అనే ఈ డ్రైవర్ తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కీచక డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఉమేశ్ ఏడాది నుంచి బాలిక కుటుంబం వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News