: అద్వానీని ఒప్పిస్తాం: వెంకయ్య


బీజేపీ అగ్రనేత అద్వానీ 2014 ఎన్నికల ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై ఎప్పటినుంచో గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. మోడీని ఎన్నికల ప్రచార సారథిగా నియమించడంపై కినుక వహించి పార్టీకి రాజీనామా చేసి, ఆనక దాన్ని ఉపసంహరించుకున్నారు. నేడు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తున్న సమయంలోనూ ఇంటికే పరిమితమై తన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అగ్రనేతను బుజ్జగించేందుకు ఇతర నేతలు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, అద్వానీని పార్టీ వదులుకోదన్నారు. ఆయనను మోడీ అభ్యర్థిత్వంపై ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకోసం ప్రయత్నాలు సాగిస్తామన్నారు.

  • Loading...

More Telugu News