: పాక్, శ్రీలంక జట్లతో టీమిండియా ట్రై సిరీస్!
అన్నీ అనుకూలిస్తే మరో రోమాంఛక క్రికెట్ టోర్నీని భారత క్రికెట్ ఫ్యాన్స్ వీక్షించవచ్చు! చెన్నైలో నేడు ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీసీఐ పాక్, లంక క్రికెట్ బోర్డుల ముందు ముక్కోణపు టోర్నీ ప్రతిపాదన ఉంచింది. భారత్ ఈ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ పై అనిశ్చితి నెలకొంది. ఆ టూర్లో ఎన్ని మ్యాచ్ లాడాలన్న విషయమై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదరకపోవడమే అందుక్కారణం. ఒకవేళ సఫారీ పర్యటన రద్దయితే శ్రీలంక, పాకిస్తాన్ లతో డిసెంబర్లో ముక్కోణపు టోర్నీ నిర్వహించాలన్నది బీసీసీఐ యోచన.