: రాజ్ నాథ్ సింగ్ కు అద్వానీ లేఖ
పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి హాజరుకాకుండా నరేంద్ర మోడీ పట్ల తనకున్న వ్యతిరేకతను వ్యక్తం చేసిన బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ వెంటనే అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. బోర్డు మీటింగ్ కు గైర్హాజరవడానికి గల కారణాన్ని వివరించిన అద్వానీ.. పార్టీ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. లేఖలో తన బాధను, ఆవేదనను తెలిపినట్లు అద్వానీ పేర్కొన్నారు.