: కాసేపట్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. మరికాసేపట్లో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. మోడీ అభ్యర్థిత్వాన్ని అగ్రనేత అద్వానీ వ్యతిరేకిస్తుండడంతో పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ మరోమారు అద్వానీతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా మోడీ అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరుస్తున్న తరుణంలో, అద్వానీ కూడా సమర్థిస్తే బావుంటుందని రాజ్ నాథ్ అగ్రనేతకు సూచించనున్నట్టు తెలుస్తోంది.