: పాకిస్థానీ క్రికెటర్లకు వీసాలు జారీ


ఎట్టకేలకు ఛాంపియన్స్ లీగ్ లో ఆడనున్న పాకిస్థానీ క్రికెటర్లకు వీసాలు జారీ అయ్యాయి. పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ వీసాలు నిరాకరించిందంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే సీఎల్ టీ20లో పాల్గొనే ఆటగాళ్లందరికీ వీసాలు మంజూరుచేసినట్టు ఇస్లామాబాద్ లోని భారత దౌత్య కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. పాక్ ఆటగాళ్లు ఎప్పుడైనా సరే ఎంబసీకి వచ్చి వారి పాస్ పోర్టులను తీసుకోవచ్చని తెలిపింది. దీంతో వారి భారత్ ప్రయాణానికి మార్గం సుగమం అయింది.

పాకిస్థాన్ కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్ ఈ ఏడాది ఇండియాలో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ లో పాక్ ఆటగాళ్లు వేర్వేరు నగరాల్లో ఆడాల్సి ఉన్నందున వారికి రక్షణ కల్పించడం కష్టమని మొదట భావించారు. అందుకే వీరికి వీసాలు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నెల 17న ఫైసలాబాద్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది.

  • Loading...

More Telugu News