: వేలం పాటకు విఖ్యాత 'నోబెల్'


వేలం పాటకు ఇల్లు , పుస్తకాలు , వాహనాలు, పలు రకాల వస్తువులు రావడం చూశాం. కానీ, విఖ్యాత నోబెల్ పురస్కారం కూడా వేలం పాటలో దొరుకుతుందన్న విషయాన్ని ఎప్పడైనా విన్నారా, కన్నారా? లేదులేండి ...అదిప్పటి వరకూ చరిత్రలో లేదు. కానీ ఇకపై జరగబోతోంది. 

డీఎన్ఏ నిర్మాణం గురించి లోకానికి వెల్లడించిన సుప్రసిద్ధ శాస్త్రవేత్తలలో ఫ్రాన్సిస్ క్రిక్ ఒకరు. జన్యుపరమాణువుల నిర్మాణ తీరును తెలియజేసే డీఎన్ఏను ఫ్రాన్సిన్, డీ వాట్సన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు 1953లో కనుగొన్నారు.

వీరిరువురు అదే ఏడాది డీఎన్ఏపై పరిశోధనా పత్రాన్ని విడుదల చేశారు. ప్రపంచాన్నే మార్చేసిన ఆవిష్కరణ కావడంతో వీరిద్దరితో పాటు వీరి సహ పరిశోధకుడు మౌరిస్ వికిన్స్ ముగ్గురిని 1962లో నోబెల్ పురస్కారం వరించింది.
 
ఇప్పుడు  ఫ్రాన్సిన్ క్రిక్ కు దక్కిన నోబెల్ బంగారు పతకం, నాడు ఫ్రాన్సిస్ అందుకున్న చెక్కు, అతడు ధరించిన సూట్ న్యూయార్క్ లో ఏప్రిల్ 10న వేలం పాటకు రానున్నాయి. 13 నుంచి 25 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని అంచనా. ప్రాన్సిన్ కుటుంబ సభ్యులే వీటిని విక్రయానికి పెట్టారు. అదీ మానవాళి మేలు కోసమే.
 
అదెలా అంటారా? వీటిని అమ్మడం ద్వారా వచ్చే నిధులను 2015లో ఫ్రాన్సిస్ పేరిట స్థాపించనున్న పరిశోధనా కేంద్రం కోసం వినియోగిస్తారు. అంతేకాదు, అమెరికాలో ఇతర పరిశోధనలకూ తోడ్పాటు అందిస్తామని ఫ్రాన్సిన్ మనవరాలు కిండ్రా చెప్పారు. అంటే, ఫ్రాన్సిస్ లేకపోయినా, మానవాళి మేలు కోసమే పరిశోధనలన్న అతడి ఆకాంక్ష కొనసాగనుందన్నమాట. ఫ్రాన్సిస్ 2004లో కన్నుమూశారు. 

  • Loading...

More Telugu News