: తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర: బీజేపీ
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ నేత ఎన్వీవీఎస్ ప్రభాకర్ నేడు మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి అలిపిరి వద్ద ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్శిటీ స్థాపనకు ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ఇది అంతర్జాతీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. హీరాగోల్డ్ సంస్థ కార్యకలాపాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.