: విద్రోహులకు ఈ తీర్పు చండశాసనం: షిండే
నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు ఢిల్లీలోని సాకేత్ ఫాస్ట్ ట్రాక్ ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్రోహులకు ఈ తీర్పు చండశాసనమని పేర్కొన్నారు. క్రూర నేరస్తులకు ఇది ఓ హెచ్చరికలాంటిదని చెప్పారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. ఓ ప్రశ్నకు జవాబిస్తూ ఇక నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా అధికారి ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళలపై అత్యాచార కేసులు హోంశాఖ వద్ద పెండింగ్ లో లేవని స్పష్టం చేశారు. సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.