: సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ బెయిల్ పిటిషన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్విడ్ ప్రో కో కేసులో సీబీఐకు తాను పూర్తిగా సహకరించినందు వల్ల..తనకు బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.