: తీర్పుపై నిర్భయ తల్లిదండ్రుల స్పందన
నిర్భయ అత్యాచార కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అయింది. ఢిల్లీ సాకేత్ కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే నిర్భయ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. కిరాతకులకు మరణశిక్ష పడడం నిజంగా హర్షణీయం అని వ్యాఖ్యానించారు. తమకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తీర్పు కోసం ఊపిరిబిగపట్టి ఎదురుచూశామని తెలిపారు. తీర్పు తమకు సంతృప్తి కలిగించిందని చెప్పారు. అత్యాచారాలపై తమ పోరాటం ఇంతటితో ఆగదని వారు ఉద్ఘాటించారు.