: విజయమ్మపై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి


వైఎస్సార్సీపీపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జగన్ కు బెయిల్ రాకుండా బాబే అడ్డుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించడాన్ని సోమిరెడ్డి తప్పుబట్టారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ వల్ల 69 మంది నేరస్తులుగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. బాబు పారిశ్రామికవేత్తలను సృష్టిస్తే, జగన్ 420లను రూపొందించాడని విమర్శించారు. జగన్ కు బెయిల్ ను బాబు ఎలా ఆపుతారో విజయమ్మ చెప్పాలని డిమాండ్ చేశారు. బెయిల్ కోసం కాంగ్రెస్ తో లాలూచీ పడింది మీరు కాదా? అంటూ ప్రశ్నించారు. కొన్ని రాష్ట్రాల్లో అవినీతికి పాల్పడ్డ నేతల ఆస్తులను జప్తు చేస్తుంటే, ఇక్కడ కంటికి కనిపిస్తున్నా ఆస్తులను జప్తు చేయడంలేదని, లాలూచీ పడ్డారనడానికి అదే నిదర్శనమని సోమిరెడ్డి ఆరోపించారు.

చుట్టూ ఫిరాయింపుదారులను పెట్టుకుని బాబుపై విమర్శలు చేయడం విజయమ్మ మానుకోవాలని సూచించారు. కొడుకు జైల్లో ఉంటే లోటస్ పాండ్, బెంగళూరులో రాజసౌధాలు, ఆస్తులు ఎందుకని ప్రశ్నించారు. ఒకప్పుడు బాబు ఉత్తమపాలన అందించారని పొగిడి, ఇప్పుడు వారే ఆయనపై విమర్శలు చేయడం సరికాదన్నారు. 'మీదో పార్టీ, మీరా మాపై విమర్శలు చేసేది' అంటూ సోమిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News