: జగన్ తో మాజీ ఎంపీ బాలశౌరి ములాఖత్
తెనాలి మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి నేడు చంచల్ గూడ జైల్లో వైఎస్ జగన్ ను కలిశారు. ఆయనతో పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే జగన్ ను కలిశానని వివరణ ఇచ్చారు. కాగా, మరికొద్దిరోజుల్లో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను నియంత్రించగల సత్తా జగన్ కే ఉందని చెప్పుకొచ్చారు. తాను ఇటీవలే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించారు. జగన్ తో బాలశౌరి భేటీ సమయంలో మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.