: ముంబయి దాడుల కేసులో పాక్ న్యాయవాది నియామకం
ముంబయి దాడుల కేసు విచారణకు సంబంధించి దాయాది దేశం పాకిస్థాన్ న్యాయవాదిని నియమించిందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. కాగా, ఈ నెల 23న భారత్ కు పాక్ న్యాయనిపుణుల కమిటీ రానుందని చెప్పారు. మరోవైపు భారత్-పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ప్రస్తుత యంత్రాంగం పని చేస్తుందని ఆశిస్తున్నట్లు పాక్ సర్కారు వ్యాఖ్యానించింది. గతనెల 6 నుంచి సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా శాంతి ప్రక్రియ నిలిచిపోవడం నిరాశ కలిగించిందని పేర్కొంది. గతనెలలో పలుమార్లు వాస్తవాధీన రేఖ వద్ద పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో భారత జవానులు మృతి చెందిన సంగతి తెలిసిందే.