: కేటీపీఎస్ లో సాంకేతిక లోపం
ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. కేటీపీఎస్ 9, 10 యూనిట్లలో లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు. దీంతో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.