: దాసరి రేపిన 'కులం' కలకలం
దర్శకరత్న దాసరి నారాయణరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పే దాసరి ఈసారి రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి అవార్డులపై తన అభిప్రాయాలను తేటతెల్లం చేశారు. తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో దాసరి మాట్లాడుతూ..'రఘుపతి వెంకయ్య నాయుడు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులో తొలుత పూర్తి పేరుతో ప్రకటించేవారు. తర్వాత రఘుపతి వెంకయ్య పేరు మీదే ఇస్తున్నారు. ఇదేంటని ఆలోచించిన నేను బహుశా ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు కులం పేరెందుకని ఇలా చేసుంటారని సరిపెట్టుకున్నాను. కానీ, తర్వాత, బీఎన్ రెడ్డి అవార్డు, నాగిరెడ్డి అవార్డు అని ప్రకటించాక మళ్లీ ఇదేంటని అనిపించిది నాకు. తీసివేస్తే ప్రభుత్వం అందరివి తీసివేయాలి. ఒక్క 'నాయుడి'ని మాత్రం తీసివేయడం సమంజసం కాదని అందరికీ అనిపించింది. ఇటు ప్రభుత్వానికి కూడా లేఖ ద్వారా నేను తెలియజేస్తా' అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో చిత్ర పరిశ్రమ వ్యక్తులు ఆలోచనలో పడ్డారు.