: సీఎం పదవి చెట్టుపై పిట్టలాంటిదంటున్న కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ సీఎం పదవిపై చమత్కార ధోరణిలో వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ ఎక్స్ పో టెల్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సీఎం పదవి చెట్టుపై ఉన్న పిట్టలాంటిదన్నారు. ఇక కేంద్ర మంత్రి పదవిని చేతిలో ఉన్న పిట్టతో పోల్చారు. చెట్టుపై పిట్ట కోసం పాకులాడితే చేతిలో ఉన్న పిట్ట ఎగిరిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. తాను సీఎం కావాలని చాలమంది కోరుకుంటున్నారని, అందుకే ఈ 'పిట్ట' కథ చెప్పాల్సి వచ్చిందని వివరించారు. ఇక, రాష్ట్ర విభజనను పరోక్షంగా సమర్థిస్తూ, చిన్న రాష్ట్రాలతో సుపరిపాలన సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాదులో ఎవరైనా ఉండొచ్చని సూచించారు. రాజధాని ఎవరి జాగీరు కాదని స్పష్టం చేశారు.