: అద్వానీని బుజ్జగించేందుకు గడ్కరీ ప్రయత్నాలు
బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై సీనియర్ నేత అద్వానీని ఒప్పించేందుకు ఆ పార్టీ నేత నితిన్ గడ్కరీ నడుం బిగించారు. ఈమేరకు నేడు అద్వానీతో భేటీ అయ్యారు. ఆర్ఎస్ఎస్ తరపున రాయబారం నడుపుతున్న గడ్కరీ అగ్రనేతను మోడీ విషయంలో ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అంతకంటే ముందు పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన గడ్కరీ.. పార్టీ కార్యకర్తలు, యువకులు మోడీని కోరుకుంటున్నారన్నారు.