: నాలుగు దశాబ్దాల తర్వాత భారత్ కు డబ్ల్యూహెచ్ వో పదవి
44 ఏళ్ల తర్వాత భారత్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థలో పదవి లభించింది. ఆగ్నేయాసియా ప్రాంత రీజనల్ డైరెక్టర్ పదవికి భారత్ కు చెందిన ఖేత్రపాల్ సింగ్ (64) ను 11 దేశాలకు చెందిన ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఈ పదవిలో సింగ్ ఐదేళ్ల పాటు కొనసాగుతారు. గతంలో భారత్ ఈ పదవిని 1948 నుంచి 1968 వరకు నిర్వర్తించింది.